OTT Movie: ఓటీటీలోకి రాబోతున్న రాజ్ తరుణ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Prasanna |   ( Updated:2024-08-16 14:27:39.0  )
OTT Movie: ఓటీటీలోకి రాబోతున్న రాజ్ తరుణ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా : యంగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన మూవీ ‘పురుషోత్త‌ముడు’. ఈ మూవీకి రామ్ భీమ‌న డైరెక్షన్ చేయగా.. హాసిని సుధీర్ కథానాయికగా న‌టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీ నటులు ఈ మూవీలో నటించారు. విడుదలకు ముందే పురుషోత్తముడు అంచనాలను పెంచేసింది.

జులై 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి ఎదురుదెబ్బ తగిలింది. రొటీన్ కథ అవ్వడంతో కలెక్షన్స్ కలెక్ట్ చేయలేకపోయింది. ఇక ఓటీటీలోకి వచ్చినప్పుడు సినిమా చూడొచ్చులే అని చాలా మంది థియేటర్లోకి వెళ్లకుండా ఆగిపోయారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి త్వరలో రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఆగ‌స్ట్ 23 నుంచి పురుషోత్త‌ముడు మూవీ ఓటీటీలోకి వ‌చ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా ప్రకటించనున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ ఉన్నప్పటికీ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేక పోయింది. ఇలాంటి కథతో అంతక ముందు శ్రీమంతుడు సినిమా వచ్చింది. మళ్ళి అదే కథ కావడంతో విజయాన్ని అందుకోలేకపోయింది.

Advertisement

Next Story