నా భార్య 9 గంటలకే పడుకుంటుంది.. తర్వాత నా మరదలితో అవన్నీ అంటూ Shilpa Shetty భర్త షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-08-01 05:26:37.0  )
నా భార్య 9 గంటలకే పడుకుంటుంది.. తర్వాత నా మరదలితో అవన్నీ అంటూ Shilpa Shetty భర్త షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత బాలవుడ్‌కు చక్కెసి వరుస చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే శిల్పాశెట్టి, ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

రాజ్‌కుంద్రా ఓ షోలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో రాజ్‌ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టి తో కలిసి ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది. నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలని పిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది. ఆమెకు త్వరగా పెళ్లి కాకూడదు. అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్‌లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లి కావాలని నేను కోరుకోను’’ అంటూ చెప్పిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Also Read: ఆమె అంతే.. నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసిన Vishal

Advertisement

Next Story