‘రుద్రుడు’ ట్రైలర్‌తో ఉగ్రరూపం చూపించిన రాఘవ లారెన్స్

by Hamsa |   ( Updated:2023-12-16 16:39:13.0  )
‘రుద్రుడు’ ట్రైలర్‌తో ఉగ్రరూపం చూపించిన రాఘవ లారెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డాన్స్ మాస్టర్‌గా రాఘవ లారెన్స్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాప్ వన్ కొరియోగ్రాఫర్‌గా నిలిచాడు. ఆ తర్వాత నాగార్జున నటించిన ‘డాన్’ చిత్రంతో నటుడిగా అలరించాడు. రాఘవ డాన్స్ మాస్టర్‌గానే కాకుండా హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘రుద్రుడు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ ప్రొడ్యూసర్ ఎస్ కతి రేసన్ దర్శకుడిగా వ్యవహరించగా.. ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తాజాగా, రుద్రుడు ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేశారు. అందులో మాస్ యాక్షన్స్‌తో రాఘవ లారెన్స్ కనిపించడంతో ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Advertisement

Next Story