షెహనాజ్‌తో డేటింగ్.. డ్రగ్‌లా మారిపోయిందంటున్న రాఘవ్

by Aamani |
షెహనాజ్‌తో డేటింగ్.. డ్రగ్‌లా మారిపోయిందంటున్న రాఘవ్
X

దిశ, సినిమా : షెహనాజ్ గిల్‌తో డేటింగ్ ఇష్యూపై నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ స్పందించాడు. సినిమా షూటింగ్ కోసం కలిసి పనిచేసినా, కలిసి టీ తాగినా సరే ప్రేక్షకులు క్షణాల్లో వ్యక్తిగత జీవితాలకు ముడిపెడుతున్నారని అభిప్రాయపడ్డాడు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, అది కాస్త గంటల వ్యవధిలోనే డ్రగ్ లాగా మారిపోవడం బాధకరమన్నాడు. ఇక తన కెరీర్‌లో చాలామందితో క్లోజ్‌గా గడిపినట్లు చెప్పిన రాఘవ్.. ‘జనాలు ఈ మధ్య చాలా డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకో నాకు తెలియట్లేదు. కొన్ని కామెంట్స్ చూస్తే దు:ఖం వస్తుంది. ఎందుకంటే సిద్ధార్థ్ శుక్లా మరణించిన తర్వాత గిల్‌ను జీవితంలో ముందుకు సాగాలని చాలా ప్రోత్సహించాను. మా ప్రేమ వార్తల్లో నిజం లేదు. పూర్తిగా ఖండిస్తున్నా. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Next Story