- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది: సైఫ్‌పై రాధిక ప్రశంసలు
దిశ, సినిమా : సెక్సీ బ్యూటీ రాధికా ఆప్టే చాలా గ్యాప్ తర్వాత 'విక్రమ్ వేద'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదలైన సందర్భంగా.. మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సైఫ్ అలీఖాన్‌కు భార్యగా నటించిన ఆమె.. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందని చెప్పింది. 'మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మరొక వ్యక్తితో సరిపోలినప్పుడు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దాన్ని బంధించడం కష్టతరమైన విషయం.
మీరు ఎవరినైనా ఇష్టపడవచ్చు కానీ మీరు ఒకరి జోకులను చూసి నవ్వుకోకపోతే అది ప్రమాదకరం. ఎందుకంటే మీ సెన్సిబిలిటీస్ సరిపోతాయనే సంగతి అవతలి వ్యక్తికి అంతగా తెలియదు. కానీ, మీరు హాస్య భావనకు సంబంధించినంత వరకూ ఒకే రకమైన ఫీలింగ్స్ కలిగిఉన్నట్లయితే మీ మనసులో సున్నితత్వమైన పోలికలున్నట్లే. కాబట్టి సైఫ్‌లోని గొప్పదనం ఏమిటంటే.. అతను తన మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పేస్తాడు. అలాగే ఎదుటి మనిషి చెప్పే విషయాన్ని పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే నేను అతనితో ఉన్నప్పుడు నా మనసులో మాట చెప్పడానికి సంకోచించలేదు. మా మధ్య సన్నివేశాలు బాగా తీయబడ్డాయి. ఎల్లప్పుడూ ఇలాంటి సంబంధాలనే ఇష్టపడతా' అంటూ చెప్పుకొచ్చింది రాధిక.
ఇవి కూడా చదవండి : పొలిటికల్ ఎంట్రీపై నాగార్జున క్లారిటీ!