Balagam Movie :కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ మూవీ నుంచి ప్రశ్న.. వేణు ఎమోషనల్

by Prasanna |   ( Updated:2023-05-19 09:05:17.0  )
Balagam Movie :కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ మూవీ నుంచి ప్రశ్న.. వేణు ఎమోషనల్
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి బిగ్ హిట్ కొట్టిన చిత్రం ‘బలగం’. దీంతో దర్శకుడిగా వేణుకు మంచి గుర్తింపు వచ్చింది. నవ్వించడమే కాదు.. ఏడిపించడంలోనూ వేణు తన మార్క్ నిరూపించుకున్నాడు. ఇప్పటిదాకా ఆయనకున్న కమెడియన్‌ ట్యాగ్ తిసేసి, మంచి టాలెంట్‌ ఉన్న ఎమోషనల్ డైరెక్టర్‌గా తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా జరిగిన కానిస్టేబుల్‌ ప్రశ్నాపత్రంలో ‘బలగం’ మూవీ నుంచి ఓ ప్రశ్న అడగటంపై దర్శకుడు వేణు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ‘నాకు ఈ ప్రశ్నపత్రం ఫొటోలు మా ఫ్రెండ్ పంపించాడు. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నా కలను నిజం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను’ అంటూ ట్వీట్ చేశాడు వేణు.

Advertisement

Next Story