Allu Arjun: ‘పుష్ప-2’ క్లైమాక్స్‌ షాకింగ్‌గా ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న అల్లు అర్జున్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-08-23 14:09:41.0  )
Allu Arjun: ‘పుష్ప-2’  క్లైమాక్స్‌ షాకింగ్‌గా ఉంటుంది.. హైప్ పెంచేస్తున్న అల్లు అర్జున్ కామెంట్స్
X

దిశ, సినిమా: 'పుష్ప' చిత్రంతో పాన్‌ ఇండియా కథానాయకుడిగా మారిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో ఆయనకు ఉత్తమనటుడిగా కేంద్రప్రభుత్వం అవార్డు కూడా వరించింది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషనలో పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2 ది రూల్‌. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే ఈ చిత్రీకరణ కార్యక్రమాలతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పెండింగ్‌ ఉండటంతో సినిమా విడుదలను డిసెంబరు 6న విడుదల చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్‌. అయితే గత కొంతకాలంగా పబ్లిక్‌ ఫంక్షన్‌లకు దూరంగా వున్న అల్లు అర్జున్‌ బుధవారం ఓ సినిమా ప్రీరీలీజ్‌ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేదికపై పుష్ప-2 గురించి పలు ఆస్తకికరమైన కామెంట్స్‌ చేశారు బన్నీ.

ఆయన మాట్లాడుతూ 'సాధారణంగా నా చిత్రం గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ అభిమానుల కోసం పుష్ప-2 గురించి చెప్పకుండా వుండలేకపోతున్నా.. పుష్ప-2 అస్సలు తగ్గేదేలా.. మీకోసం.. ఈ సినిమా బెటర్‌ క్వాలిటీ కోసం దర్శకుడు ఎక్కువగా కష్టపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఇలాంటి పతాక సన్నివేశాలు వున్న చిత్రం చేయలేదు. ఎంతో డిఫికల్ట్‌గా వుండే క్లైమాక్స్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నారు. తప్పకుండా ఇది మీ అందరికి షాకింగ్‌గా వుంటుంది. పుష్ప-2 క్లైమాక్స్‌ మరో లెవల్‌లో వుంటుంది' అన్నారు. ఇదే వేదికపై సుకుమార్‌ పుష్ప ఫ్రాంఛైజీ మా కాంబినేషనల్‌ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పడం విశేషం.

Advertisement

Next Story