- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'Purushothamudu' ప్రీ రిలీజ్ ఈవెంట్.. తప్పకుండా హిట్ సాధిస్తామంటూ డైరెక్టర్ కామెంట్స్
దిశ, సినిమా: రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త చిత్రం 'పురుషోత్తముడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం రాజ్‌తరుణ్-లావణ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ వేడుకు హీరో రాజ్‌తరుణ్ హాజరు కాలేదు. హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌భీమన దర్శకుడు. డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే జూలై 26న చిత్రం విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నటులు బ్రహ్మానందం, రాజా రవీంద్ర, ప్రవీణ్‌తో పాటు దర్శకుడు వీరశంకర్, హీరోయిన్ హాసిని సుధీర్, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నా గత సినిమాలు విజయం సాధించలేదు. ఈ చిత్రం తప్పకుండా హిట్ కొట్టాలని ఎంతో కష్టపడి పనిచేశాను. రామయాణం అంత రమణీయంగా, భారతం అంత భారీగా పురుషోత్తముడును రూపొందించాను. తప్పకుండా ఈ చిత్రం నాకు దర్శకుడిగా మంచి పేరును తీసుకు వస్తుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాం. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.