చార్మీతో ఎఫైర్.. బండ్ల గణేష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పూరి జగన్నాథ్

by samatah |   ( Updated:2022-06-27 09:40:35.0  )
చార్మీతో ఎఫైర్.. బండ్ల గణేష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పూరి జగన్నాథ్
X

దిశ, వెబ్‌డెస్క్ : బండ్ల గణేష్ ఏ ఈవెంట్‌లో అయినా సరే తనకు నచ్చినట్లు ఒపెన్‌గా మాట్లాడేస్తుంటాడు. ఇటీవల టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి 'చోర్ బజార్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి తన కుమారుడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాకుండా ముంబైలో ఉన్నాడు.. అతని భార్య లావణ్య దేవతా అంటూ పూరిపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే విమర్శలపై టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ పరోక్షంగా స్పందించారు.

తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఆడియోలో దర్శకుడు మాట్లాడుతూ.. మనం ఎక్కువ మాట్లాడితే ఏమీ నేర్చుకోలేమని అన్నారు. గుర్తు పెట్టుకోండి, మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం, అందుకే ఎక్కువ సేపు మాట్లడటం కన్నా వినడం అలవాటు చేసుకోవాలి, అదే మంచిదన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు, మీ ఫ్రెండ్స్ కావొచ్చు, ఆఫీస్ మెంబర్స్ కావొచ్చు.. ఆకరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌ గా ప్రవర్తించొద్దు, మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా సుమతీ శతకం'లోని ఒక లైన్‌ను చెప్తూ.. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ అని. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. చివరగా ఒక మాట.. నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది' అని పూరి జగన్నాథ్ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. అయితే పూరి ఈ వ్యాఖ్యలు బండ్ల గణేష్‌ను ఉద్దేశించే చేశాడంటున్నారు కొందరు. పూరి జగన్నాథ్ చార్మీతో ఎఫైర్‌పైనే నిర్మాత బండ్లగణేష్ కామెంట్స్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు బండ్లపై డైరెక్టు‌గా కాకుండా పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడంటూ కొందరు ముచ్చటిస్తున్నారు

.

కంచెతో కామవాంఛ తీర్చుకుంటున్న మహిళ.. గతంలో ఈఫిల్ టవర్‌తో.


పోర్న్ వీడియోలో నటిస్తే కోట్లు ఇస్తా.. నటికి నిర్మాత ఆఫర్


వీడిన బీఎస్పీ(BSP) జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ

Advertisement

Next Story

Most Viewed