డబ్బుల కోసం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆ పని చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోందిగా..

by Dishafeatures2 |
డబ్బుల కోసం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆ పని చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోందిగా..
X

దిశ, సినిమా : జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు.. ప్రతి ఒక్కరూ తమ లైఫ్‌లో కష్ట సుఖాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొందరు కష్టాలను చూసి భయపడిపోతుంటారు. తీవ్ర నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోతుంటారు. కానీ ఇంకొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ సమస్యలు వెంటాడుతున్నా భయపడరు. వయస్సుకు మించిన సవాళ్లు ఎదురైనా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోరు. పైగా ప్రతీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాంటారు. చివరికి అందరూ ఆదర్శంగా తీసుకునేలా ఎదుగుతారు. అలాంటి వారిలో పంజాబీ నటి నీరూ బజ్వా కూడా ఒకరు.

1998లో దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘మయిన్ సోలాహ్ బరాస్‌కి’ చిత్రంతో వెండితర అరంగ్రేటం చేసిన నీరూ బజ్వా మొదటి సినిమాతోనే ఓటమిని ఎదురు చూసింది. ఈ మూవీ కాస్త బక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఆ తర్వాత ఆమెకు చాలా కాలంపాటు సినిమాల్లో చాన్సెస్ రాలేదు. దీంతో 2003లో టెలివిజన్ షోలలో నటించింది. ఇక చివరికి 2007లో ‘హల్లా గల్’ చిత్రంతో పంజాబీ సినిమాల్లోకి అడుగిడిన ఈ బ్యూటీకి సక్సెస్ వరించడంతో ఆ తర్వాత నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ‘జట్ అండ్ జమీలా’ ‘యారా దిల్దారా’ ‘మేలే గుర్ కియాన్’ వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పంజాబీ సినీ ఇండస్ట్రీలోనే ఏలుతోంది. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల లిస్టులో ఈ అమ్మడు టాప్ ప్లేస్‌లో ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీరూ బజ్వా తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్ అయింది. ‘‘తొమ్మిదేళ్ల వయస్సులోనే డబ్బుల్లేక చాలా కష్టాలు పడ్డా. మా నాన్న డాక్టర్‌గా ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. కుటుంబం గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో నేను ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేయాల్సిన దుస్థితి వచ్చింది. అదే సందర్భంలో ఉదయం పూట న్యూస్ పేపర్ వేసేదాన్ని. మా అమ్మ కూడా ఒక హోటల్‌లో హౌస్ కీపింగ్ వర్క్ చేసింది. ఇలాంటి కష్టాల నడుము చదువు మానేయాల్సి వచ్చింది. తర్వాత నటనపై నాకున్న ఇంట్రెస్ట్‌తో యాక్టింగ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యా’’ అంటూ చెప్పుకొచ్చింది నీరూ బజ్వా. ప్రజెంట్ ఈమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed