PAWAN KALYAN: పవర్ స్టార్ డేట్స్ కోసం ఎదురుచూస్తోన్ననిర్మాతలు.. కేవలం 10 డేస్ కావాలని రిక్వెస్ట్

by Anjali |
PAWAN KALYAN: పవర్ స్టార్ డేట్స్ కోసం ఎదురుచూస్తోన్ననిర్మాతలు.. కేవలం 10 డేస్ కావాలని రిక్వెస్ట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎన్నో వైఫల్యాల తర్వాత జనసేనాని ఊహించని విధంగా విజయం సాధించడంతో అభిమానులు, జనసేన కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాలు (హరహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ గబ్బర్ సింగ్) పెండింగ్‌లో ఉన్నాయి.

దీంతో దర్శక, నిర్మాతలు పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పవర్ స్టార్ ఓ వైపు పాలనపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా ఉండటంతో పెండింగ్ లో ఉన్న సినిమాల కోసం నిర్మాతలు ఏం చేయలేక సతమతమవుతున్నారు. అయితే ‘హరహర వీరమల్లు’ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. కాగా నిర్మాత రత్నం.. జనసేనానిని కనీసం పది రోజులైన సమయం ఇవ్వాలని కోరుతున్నారట. 10 రోజుల్లో మిగతా షూటింగ్ పూర్తి చేసే యోచనలో ఉన్నారట. మరీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైమ్ ఇవ్వనున్నాడా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story