- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
దిశ, సినిమా : మెగా, అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ఒకే ఫ్యామిలీ లాగా కలిసి ఉంటారు. కానీ ఈ మధ్య అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. ఇక వీర మళ్ళీ కలవడం కష్టమే అంటూ అనేక వార్తలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేశాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ సెలబ్రెషన్స్‌కు అల్లు ఫ్యామిలీ రాకపోవడం, ప్రమాణ స్వీకారానికి కూడా వీరు వెళ్లకపోవడంతో ఆ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసినట్లైంది. అయితే తాజాగా ఈ గొడవలపై నిర్మాత బన్నీవాసు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తొలగడానికి ఒక సందర్భం వస్తుంది, అది వచ్చిన రోజు మనస్పర్థల అన్నీ తొలిగిపోవాలని, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఆయన నిర్మాణంలో వస్తున్న ఆయ్ మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సందర్భంగా ఆయనను ఓ రిపోర్టర్ మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవల గురించి అడగ్గా ,ఆయన షాకింగ్ సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు మెగా ఫ్యామిలీని నేను 20 ఏళ్లుగా చూస్తున్నాను. వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుందో, ఆ కుటుంబ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, చిరంజీవి, ఫ్యామిలీ మొత్తం ఒకచోట కలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకే ఆయన సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి సెలబ్రెట్ చేసుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు కుటుంబంలో గొడవలు రావడం అనేది సహజం. ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక్కోసారి మనస్పర్థలు వస్తుంటాయి. దాంతో వారు తాత్కాలికంగా దూరంగా ఉండొచ్చు, కానీ వారు ఒకరికి సమస్య వస్తే ఇంకొకరు వారి కోసం ఎలా అండగా నిలబడతారు అనేది నాకు తెలుసు. ఇదంతా తీసేయడానికి ఒక సిట్యువేషన్ చాలు, నేను ఆ సమయం కోసమే చూస్తున్నాను, ఆ కుటుంబం బాగుండాలి, అంతా సర్దుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. దీంతో నిజంగా అల్లు, మెగా ఫ్యామిలీ చాలా దూరమైపోయారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.