Producer Bunny : నాలాగే ప్రేక్షకులు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.. ‘ఆయ్’ సినిమాపై నిర్మాత కామెంట్స్

by sudharani |
Producer Bunny : నాలాగే ప్రేక్షకులు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.. ‘ఆయ్’ సినిమాపై నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: నార్నే నితిన్, నయన్ సారికలు జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రజెంట్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నీ వాస్ మీడియాతో ముచ్చటించి.. సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు.

‘అనీల్ రావిపూడి డైరెక్షన్ టీమ్‌లో డైరెక్టర్ అంజి చాలా సినిమాల‌కు వ‌ర్క్ చేశారు. మా కో ప్రొడ్యూస‌ర్స్ రియాజ్‌, భాను ఈ స్క్రిప్ట్‌ను నా ద‌గ్గర‌కు తీసుకొచ్చారు. అమ‌లాపురం కుర్రాడు క‌థ వినాల‌ని కో ప్రొడ్యూస‌ర్స్ చెప్పారు. వాళ్లేమో నాకు మంచి మిత్రులు కావ‌టంతో స‌రే విందామ‌ని కూర్చున్నాను. రెండున్నర గంట‌లు నాన్‌స్టాప్‌గా న‌వ్వాను. కూక‌ట్ ప‌ల్లిలో విశ్వనాథ్‌లో సినిమా రిలీజ్ త‌ర్వాత ఆడియెన్స్‌తో క‌లిసి చూస్తున్నప్పుడు నా ఎదురు సీట్‌లో ఉన్న వ్యక్తి న‌వ్వలేక లేచి నిలుచున్నాడు. అప్పుడ‌ర్థమైంది. నేను క‌థ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల‌య్యానో అది నిజ‌మైంద‌నిపించింది. నేను క‌థ విన్నప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో దాన్ని స్క్రీన్‌పై చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే గ‌ట్టిగా కొట్టేశామ‌నిపించింది. ఫ‌స్టాఫ్ చివ‌రి అర్థగంట థియేట‌ర్స్‌లో ఒక‌టే న‌వ్వులు’ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తంగా సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు థాంక్యూ అని తెలిపారు.

Advertisement

Next Story