- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
priyanka chopra: పెళ్లై ఆరేళ్లు గడుస్తోన్న సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రొమాంటిక్ కపుల్
దిశ, వెబ్‌డెస్క్: మల్టీ టాలెంటెడ్ (నటి, గాయని, నిర్మాత, హీరోయిన్)గా పేరు దక్కించుకున్న హీరోయిన్లలో నటి ప్రియాంక చోప్రా ఒకరు. అంతేకాకుండా ఈ బ్యూటీ 2000 మిస్ వరల్డ్ పోటీ విజేతగా నిలిచింది. ఏకంగా ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంది. కమీనీ 7 ఖూన్ మాఫ్, బర్ఫీ, ది వైట్ టైగర్, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ వంటి తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా ఈ బ్యూటీ పలు స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెరవడం విశేషం. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు.
వ్యక్తిగత విషయాలకొస్తే.. ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో వీరి వివాహం పెద్ద దుమారమే రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిక్ ప్రియాంక చోప్రా కంటే 10 ఏళ్లు చిన్నవాడని టాక్. అయినప్పటికీ ఈ జంట ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి జీవిస్తుంటారు. ప్రియాంక, నిక్కు ఓ పండంటి పాప కూడా ఉంది. వీరు అమెరికాలోనే సెటిల్ అయ్యారు.
తాజాగా ప్రియాంక బికినీ ధరించి.. తన భర్తతో సముద్ర ఒడ్డు తీరాన ఏకాంతంగా గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక సోషల్ మీడియాలో పంచుకుంది. డార్క్ కలర్ టూపీస్ బట్టల్లో నటి ప్రియాంక నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భర్త ఒడిలో అలా పడుకుని స్వేద తీరుతుంది. నవదంపతులుగా కనిపిస్తోన్న ఈ కపుల్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పెళ్లై ఆరేళ్లు గడుస్తోన్న నవదంపతుల్లాగే ఉన్నారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Read More....
Janhvi Kapoor: అతని సలహా వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాన్సులు.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్