'OG'లో పవన్ సరసన ప్రియాంక మోహన్

by Shiva |
OGలో పవన్ సరసన ప్రియాంక మోహన్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి పెట్టాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే 'వినోదయ సితం' రీమేక్ సినిమా షూటింగ్ కు గాను 25 రోజులు వరుస డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు పవన్.

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా 'They call him OG' సినిమా సెట్లోకి పవన్ అడుగుపెట్టాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ ముంబైలో మొదలుకాగా.. పవన్ నిన్నటి నుంచి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా 'They call him OG' నుండి మరో అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ప్రియాంక మోహన్ నటించనుంది. తెలుగులో శ్రీకారం, నాని గ్యాంగ్ లీడర్ సినిమాల్లో నటించిన ప్రియాంక మోహన్ తమిళ సినిమాలైన డాక్టర్, డాన్ సినిమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా OG నుంచి వరుస అప్ డేట్లు వస్తుండటంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Advertisement

Next Story