బ్యూటీఫుల్ లుక్‌లో అట్రాక్ట్ చేస్తున్న ప్రియాంక.. బాలీవుడ్ క్వీన్ అంటున్న ఫ్యాన్స్

by Nagaya |
బ్యూటీఫుల్ లుక్‌లో అట్రాక్ట్ చేస్తున్న ప్రియాంక.. బాలీవుడ్ క్వీన్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సరికొత్త స్టైల్‌లో దర్శనమిచ్చి ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది.ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఎంజాయ్ చేస్తున్న నటి.. తాజాగా పారిస్‌లోని రిట్జ్ హోటల్లో జరిగే ఫంక్షన్‌కు హాజరవుతుండగా.. నెక్‌లైన్‌తో కూడిన నారింజ రంగులో ఉండే మెటాలిక్ గౌను ధరించి మైమరపించింది. అలాగే ఎద అందాలు కనిపించేలా కాస్త బోల్డ్ లుక్ యాడ్ చేసిన ప్రియాంక.. అందుకు తగిన పింక్ డైమండ్‌ సిల్వర్ స్నేక్ నెక్లెస్‌, లూజ్ హెయిర్‌తో నెటిజన్ల అటెన్షన్ క్యాచ్ చేసింది. అయితే తన ఫ్యాషన్, పారిస్ టూర్ గురించిన మిగతా వివరాలేవి చెప్పలేదు కానీ.. అక్కడ చూడదగిన ప్రదేశాల గురించి వివరించమని అభిమానులను కోరింది. ఇక ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. 'క్వీన్ ఆఫ్ బాలీవుడ్, క్వీన్ ఆఫ్ జెనోవియా అండ్ క్వీన్ ఆఫ్ కే పాప్ స్లేయింగ్' అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed