రూ.165 కోట్ల ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక చోప్రా.. కారణమేంటంటే?

by Hamsa |   ( Updated:2024-02-02 08:59:05.0  )
రూ.165 కోట్ల ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక చోప్రా.. కారణమేంటంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలతో అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే 2019లో ఈ దంపతులు 20 మిలియన్ డాలర్లతో లాస్ ఏంజిల్స్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనగోలు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ కరెన్సీలో దాని విలువ ఏకంగా రూ. 165 కోట్లు అని సమాచారం. అందులో కల్లు చెదిరే సౌకర్యాలు ఉంటాయట. అందులో 7 బెడ్‌రూమ్‌లు, 9 బాత్’‌రూమ్‌లు చెఫ్ కిచెన్, హోమ్ థియేటర్, జిమ్ బిలియర్డ్స్ రూమ్ లాంటివి ఎన్నో ఉన్నాయట.

అయినప్పటికీ అంతటి విలాసవంతమైన ఇల్లును వదిలి ఈ జంట హఠాత్తుగా బయటకు వచ్చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు చోట్ల నీళ్లు లీక్ అవుతుండటం పెద్ద సమస్యగా మారిందట. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని భావించి ఆ ఇంటిని ఖాళి చేసినట్లు టాక్. అయితే వారికి ఇళ్లును అమ్మిన వ్యక్తి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి మరమత్తులు చేసి ఇవ్వాలని అతనిపై కోర్ట్‌లో దావా కూడా వేశారట. మరి అతను ఇల్లును బాగు చేయించాకా ప్రియాంక మళ్లీ అదే ఇంటికి పోనుందా.. లేక మరో ఇంటిని కొనుగోలు చేసి పోతుందో చూడాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed