- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాసిన బట్టలు.. చెదిరిన జుట్టు.. ఇదీ ఆ హీరోయిన్ పరిస్థితి.. ఆమెను చూస్తే అయ్యో అనాల్సిందే..
దిశ, సినిమా : టీవీ నటి, రియాలిటీ షో 'బిగ్ బాస్ 16' కంటెస్టెంట్ ప్రియాంక చాహర్ చౌదరి గురించి తెలియని వారు ఉండరేమో. ఆమె అందంతో, అభినయంతో అందరినీ మెస్మరైజ్ చేసేస్తుంది. ఇటీవలి కాలంలో తన కొత్త పాట 'దోస్త్ బాంకే రహతే హై నా..' పాటకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా ప్రియాంకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మరి ఆ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో ప్రియాంక చాహర్ చౌదరి మురికి బట్టలతో, చెదిరిన జుట్టుతో ఉంది. ముఖం మీద నల్లటి మసి కూడా పూసి ఉంది. ఆ వేశధారణలో ఒక హోటల్ వెలుపల ఉన్న ఆమెను అక్కడ కొంతమంది సిబ్బంది హోటల్ లోపలికి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.
నిజానికి ఆ వీడియో ప్రియాంక చాహర్ చౌదరి నటిస్తున్న కొత్త మ్యూజిక్ వీడియో 'దోస్త్ బాంకే...'లోది. ఆ పాటలో ఓ అమ్మాయి ప్రియుడితో గర్భవతి అయి, మోసపోయి చివరికి ఆమె ఏ పరిస్థితికి చేరుకున్నది అనే సారాంశాన్ని అందించింది.
అయితే ఆ పాటలో ప్రియాంక ఏ లుక్ లో ఉందో వైరల్ అవుతున్న వీడియోలో అదే లుక్‌లో కనిపిస్తుంది. అందులో హోటల్ సిబ్బంది ఆమెను ఆపుతున్నారు. అయితే ఈ వీడియోను చూసిన వారంతా భిన్నమైన స్పందనలు ఇచ్చారు. పూనమ్ పాండే తరహాలోనే ఇది ప్రమోషన్ మార్గం అని కొందరు అంటున్నారు. షూటింగ్ ముగిశాక ప్రియాంక కూడా ఇలాగే హోటల్‌కి వెళ్లిందని, అక్కడ ఆమెను ఎవరూ గుర్తించలేదని కొందరు చెబుతున్నారు.