Shah Rukh Khan తో మళ్లీ చిందులేయనున్న Priyamani (ప్రియమణి).. ఇదీ హిట్టేనా?

by sudharani |   ( Updated:2022-11-25 10:08:16.0  )
Shah Rukh Khan తో మళ్లీ చిందులేయనున్న Priyamani (ప్రియమణి).. ఇదీ హిట్టేనా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం 'జవాన్'. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా, విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకొచ్చింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌లో కనిపించనుందట. ఇక 2013లో వచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంలో '1-2-3-4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్' అనే ఐటెం సాంగ్‌లో షారుఖ్‌తో కలిసి ప్రియమణి ఆడిపాడగా.. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో 'జవాన్' మూవీలోనూ షారుఖ్‌తో ఐటెం సాంగ్‌లో నటించినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికే పాట చిత్రీకరణ కూడా పూర్తయినట్లు టాక్. నిజానికి ఈ మూవీలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న నయనతార నుంచి ఎలాంటి గ్లామరస్ ట్రీట్ లేదని, అందుకే ఈ పాట కోసం ప్రియమణిని తీసుకున్నారని సమాచారం.

Read More: షారుక్ నుంచి యాక్టింగ్ ట్రిక్స్ నేర్చుకున్నా: Vicky Kaushal

Advertisement

Next Story