అక్కడ ముద్దులు పెడుతూ యువతకు పిచ్చేక్కిస్తోన్న ప్రియమణి.. తట్టుకోలేకపోతున్నామంటున్న జనాలు

by Anjali |   ( Updated:2024-03-11 13:58:01.0  )
అక్కడ ముద్దులు పెడుతూ యువతకు పిచ్చేక్కిస్తోన్న ప్రియమణి.. తట్టుకోలేకపోతున్నామంటున్న జనాలు
X

దిశ, సినిమా: సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి సుపరిచితమే. ఈ అమ్మడు అందం, నటన, డ్యాన్స్, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఇప్పటికి ఇండస్ట్రీలో మంచి నటిగా రాణిస్తున్నప్పటికీ ప్రియమణి ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా.. వచ్చిన ప్రతి చాన్స్ ను వినియోగించుకుంటూ ముందుకెళ్తోంది. అప్పట్లో స్టార్ హీరోల సరసన కమర్షియల్ మూవీల్లో గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా వెనకాడలేదు. ప్రస్తుతం ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

తాజాగా ఈ హీరోయిన్ పలచని ట్రాన్స్ పరెంట్ శారీలో సోషల్ మీడియాను షేక్ చేసే స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రియమణి టాప్ టూ బాటమ్ నిండైన సొగసులో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్ లా వెలిగిపోతున్న ఈ బ్యూటీ చేతిలో ఓ రోజ్ ఫ్లవర్ పట్టుకుని.. దానికి ముద్దు పెడుతూ ఫొటోలు దిగింది. చేతిలో రోజా పువ్వు పట్టుకుని ఈ బ్యూటీ ఇచ్చిన హాట్ పిక్స్ యువత హృదయాల్ని కొల్లగొడుతున్నాయి. విరహ వేదనలో తేలుతోన్న ఈ ఫొటోలు చూస్తే పిచ్చేక్కిపోతుందంటూ జనాలు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ప్రియమణి లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story