ఆస్కార్ వేడుకలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే గుండె ఆగాల్సిందే..

by sudharani |
ఆస్కార్ వేడుకలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే గుండె ఆగాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: 95 వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మన ఇండియాకు రెండు ఆస్కార్లు రావడం.. అందులో ముఖ్యంగా మన తెలుగు సినిమా అవార్డు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు సంతోషాన్నిచ్చింది. అయితే.. ఆస్కార్ వేడుకలో మన హీరోలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో అలరించారు. ఈ క్రమంలోనే మన నెటిజన్స్ కన్ను ఎన్టీఆర్ వాచ్‌పై పడింది. అతడు ధరించిన వాచ్ విలువ ఎంత అని తెలుసుకునే పనిలో పడ్డారు.

95 వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.తీరా ఆ వాచ్ ధర తెలుసుకుని షాక్ అయ్యారు. ఇంతకి ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ‘‘Patek Philippe Nautilus Travel Time’’. ఈ వాచ్ ధర అక్షరాల 190,000 డాలర్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక కోటి యాభై ఆరు లక్షల పదమూడు వేల నూట యాభై ఐదు (1,56,13,155) రూపాయలు. కాగా.. ఈ వాచ్ ధర తెలుసుకుని నెటిజన్స్ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed