అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ ధరించిన నగ ధర ఎన్ని కోట్లో తెలిస్తే ఖంగుతినాల్సిందే?

by Anjali |
అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ ధరించిన నగ ధర ఎన్ని కోట్లో తెలిస్తే ఖంగుతినాల్సిందే?
X

దిశ, సినిమా: రీసెంట్‌గా ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం కూడా అనంత్ అంబానీ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈయన పెళ్లికి పలువురు సెలబ్రిటీలు వెళ్లి తెగ సందడి చేశారు. కుమారుడి పెళ్లిలో ముఖ్యంగా నీతా అంబానీ ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పుడే కాదు.. ఎప్పుడైన ఖరీదైన వస్తువులను వాడుతూ సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది. తన లుక్స్, ఫ్యాషన్‌తో వివాహానికి హాజరైన అతిథులందరినీ ఆకట్టుకుంది. ఈమె ధరించిన డైమండ్ నెక్లెస్ ఇంకా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

దీని ధర ఎంతని పలువురు నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిసింది. నీతా అంబానీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా కోటికి పైనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నీతా అంబానీ నగ అండ్ ఇయర్ రింగ్స్ భారీ ఖరీదు విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed