- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి విషయంలో వస్తున్న ఒత్తిడి నిజమే: విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్, తమన్నాతో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల పలు వార్తలు కూడా వచ్చాయి. అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ.. తమన్నా, విజయ్ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయ్యారు. అయితే తమన్నాను పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు విజయ్‌ని ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా, వాటిపై ఆయన స్పందించారు. ‘‘ నా జీవితంలో పెళ్లి పై ఒత్తిడి ఎప్పుడో ప్రారంభమైంది. నేను మార్వాడీని. మా కమ్యూనిటీలో, అబ్బాయిలు 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోగల వయస్సుగా పరిగణించబడతారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో నా జీవితంలో ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ల తర్వాత నా పెళ్లి గురించి ఈ ఒత్తిడి కొంచెం తగ్గింది.
ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే వయసు ఎప్పుడో దాటిపోయింది. పైగా అప్పటికి నేను నటుడిని అయ్యాను. ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. మా అమ్మ మాత్రం పదేపదే పెళ్లి ప్రస్తావన తెచ్చేది. కానీ, నేను మాత్రం కెరీర్ వైపు మాత్రమే దృష్టి పెట్టాను. ఇప్పటికి కూడా అమ్మ ఫోన్ కాల్ వస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? అని అంటుంది. సినిమాలో బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇన్ని రోజుల వరకు చెప్పేవాడిని కానీ, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అది తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.