మాల్దీవుల్లోPrabhas , Kriti Sanon నిశ్చితార్థం.. ప్రభాస్ టీమ్ రియాక్ట్ !

by Prasanna |   ( Updated:2023-02-13 14:10:50.0  )
మాల్దీవుల్లోPrabhas , Kriti Sanon నిశ్చితార్థం.. ప్రభాస్ టీమ్ రియాక్ట్ !
X

దిశ, సినిమా : ప్రభాస్‌తో పెళ్లి రూమర్స్‌లో ప్రస్తుతం అనుష్క ప్లేస్‌లోకి కృతి సనన్ చేరింది. అతనితో ఈ బ్యూటీ డేటింగ్‌లో ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజం కాదని, తమ మధ్య ఏమీ లేదని ప్రభాస్, కృతి చెప్తున్నప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. తాజాగా "బ్రేకింగ్ న్యూస్.. కృతి సనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది" అంటూ బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇది సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీలో‌నూ హల్ చల్ చేస్తోంది. నిజానికి ఉమైర్ సంధు చేసిన ట్వీట్లు చాలా వరకు వివాదాస్పదంగానే ఉంటాయి. అందుకే చాలా మంది అది తప్పుడు వార్త అంటూ కొట్టిపారేస్తున్నప్పటికీ నెటజన్లు మాత్రం ఇది నిజమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం‌పై రీసెంట్‌గా ప్రభాస్ టీమ్ కూడా స్పందించింది. ''ప్రభాస్, కృతి కేవలం స్నేహితులు మాత్రమే. వారి నిశ్చితార్థం గురించి వచ్చిన వార్తలు నిజం కాదు' అని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి : Ram Charan : విజయ్ "లియో" మూవీ‌లో చరణ్ కూడా ఉన్నాడా?

Advertisement

Next Story