Rebel star Prabhas: రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్ (వీడియో)

by Hamsa |
Rebel star Prabhas: రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్ (వీడియో)
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్’. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. రాజా సాబ్ సినిమా షూటింగ్ 40 పర్సెంట్ పూర్తియినట్లు సమాచారం. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ విడదలై ఇప్పటికే హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ అందరినీ థ్రిల్ చేస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నట్లు ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed