Raja Deluxe Movie : మాస్ టైటిల్స్‌తో ప్రభాస్ కొత్త మూవీ..

by Dishaweb |   ( Updated:2023-06-22 11:39:23.0  )
Raja Deluxe Movie : మాస్ టైటిల్స్‌తో ప్రభాస్ కొత్త మూవీ..
X

దిశ,వెబ్‌డెస్క్: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అనే చెప్పాలి.రీసెంట్ గా రిలీజ్ అయిన ఆదిపురుష్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా అద్బుతమైన స్టార్ట్ ను సొంతం చేసుకుంది.అయితే మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ అటు వసూళ్ల విషయంలో మాత్రం దుమ్ము రేపుతుంది అని చెప్పాలి.టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాకు సైన్ చేశాడు.

ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు మరో రెండు టైటిల్స్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి 'రాయల్' కాగా.. మరొకటి 'అంబాసిడర్' అని సమాచారం. ఈ రెండింటిలో దేనికి మంచి రెస్పాన్స్ వస్తుందో ఆ టైటిల్ ఫిక్స్ చేయనున్నారట.ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండటం గమనార్హం.

Read more : డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

Next Story