Prabhas Kalki : కమల్ హాసన్ వల్ల ఆ చాన్స్ మిస్ చేసుకున్న నటుడు.. ఆ టైమ్‌లో ఏం జరిగిందంటే

by Javid Pasha |
Prabhas Kalki : కమల్ హాసన్ వల్ల ఆ చాన్స్ మిస్ చేసుకున్న నటుడు.. ఆ టైమ్‌లో ఏం జరిగిందంటే
X

దిశ, సినిమా : అనుకున్నవి జరగవు కొన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని అన్నట్లు.. ఓ నడుడి విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఓ ఫేమస్ హీరో వల్ల ఆ సూపర్ హిట్ మూవీలోని ప్రముఖ పాత్రలో నటించాల్సిన అవకాశాన్ని కోల్పోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘కల్కి 2898 AD’ మూవీ ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే నటించగా, ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. నటనా పాటవాలతో మూవీ స్థాయిని మరో లెవల్‌కు తీసుకెళ్లారు.

కాగా ప్రజెంట్ ‘కల్కి’ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. అందులో ‘యాస్కిన్ పాత్ర’‌లో కమల్ హాసన్ నటించిన సంగతి తెలిసిందే. కానీ ఒకవేళ ఆయన నటించకపోయి ఉంటే.. ఆ స్థానంలో ప్రముఖ మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్ నటించేవారట. ఎందుకంటే మొదట యాస్కిన్ రోల్ కోసం కమల్‌ను సంప్రదించగా.. ఆయన ఇంకా సమయం కావాలని అడగడంతోపాటూ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ యాస్కిన్ పాత్ర కోసం మోహన్‌ లాల్ సంప్రదించాలనున్నారు. కానీ చివరికి కమల్ హాసన్ ఓకే చెప్పడంతో మోహన్ లాల్‌ను కాదని, కమల్‌కే చాన్స్ ఇచ్చారు. దీంతో మోహన్ లాల్ కల్కీలో మంచి రోల్ మిస్ చేసుకున్నాడని సినీ లవర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.

Advertisement

Next Story