Shraddha Das : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్... ఏమన్నారంటే?

by Kavitha |   ( Updated:2024-01-11 06:00:42.0  )
Shraddha Das : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్... ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే మరి కొంతమంది సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ పెళ్లి గురించి కూడా చాలా రకాల రూమర్స్ వినపడుతున్నాయి.

నటిగా శ్రద్ధాదాస్ ‘ఆర్య 2’, ‘డార్లింగ్’ వంటి తదితర సినిమాల్లో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రజంట్ అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఆమె గత కొంతకాలంగా ప్రముఖ వ్యాపారవేత్త తో డేటింగ్ లో ఉందని.. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు ఆమె స్పందించలేదు. ఇక తాజాగా ఈ వార్తలకు శ్రద్ధాదాస్ చెక్ పెట్టింది.. ‘ నా పెళ్లి గురించి చాలా వార్తలు వింటున్నాను. నేను ఏ బిజినెస్ మెన్ తోను డేటింగ్ లో లేను, నాకు ఎవరు కూడా తెలియదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Next Story