Kriti Sanan సమక్షంలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన Prabhas

by GSrikanth |   ( Updated:2023-06-07 14:38:18.0  )
Kriti Sanan సమక్షంలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన Prabhas
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన చిత్రం ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతోంది. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. అయితే, విడుదల తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం రాత్రి తిరుపతిలో ఘనంగా చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే, ఫంక్షన్‌లో పెళ్లిపై ప్రభాస్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు ఒక్కసారిగా అరుపులు కేకలతో హోరెత్తించారు. దీంతో తప్పక స్పందించిన ప్రభాస్.. తప్పకుండా తన పెళ్లిని తిరుపతిలోనే చేసుకుంటానని, ఎప్పుడు అనేది అతి త్వరలోనే వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాగా, గతకొన్ని రోజులుగా ప్రభాస్-కృతి సనన్ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో కృతి సనన్ సమక్షంలో ప్రభాస్ పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటానని చెప్పడం చర్చనీయాంశమైంది.

Also Read..

గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ (వీడియో)

‘ఆదిపురుష్‌’ ప్రీ రిలీజ్ వేదికగా చిరంజీవిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story