Wayanad landslides : వయనాడ్‌కు భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్

by Mahesh |   ( Updated:2024-08-07 05:18:00.0  )
Wayanad landslides : వయనాడ్‌కు భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కేరళలో కురిసిన భారీ వర్షాలకు వయనాడ్ లోని మోప్పాడిలో భారీగా వరదలు వచ్చాయి. దీంతో కొండ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ల్యాండ్‌స్లైడ్ అయింది. దీంతో మోప్పాడి గ్రామంలోని నాలుగు వందల ఇండ్లు కొండచరిల్లో పడి పట్టుకొని పోయాయి. ఈ ప్రకృతి విలయంలో దాదాపు 360 మంది ప్రాణాలు కోల్పోగా మరో 100 మంది ఆచూకీ లభించడం లేదు. నేటీకి అక్కడ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ప్రకృతి విజయం కారణంగా వందలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరిస్తున్నారు. ఇదే మార్గంలో భారత్ లోని వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ హీరోలు సైతం వయనాడ్ బాధితులకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా రెండు రోజుల క్రితం హీరో అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ప్రకటించగా, మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరన ఇద్దరూ కలిసి రూ. 1 కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
Next Story

Most Viewed