Allu Arjun: అల్లు అర్జున్ విషెస్ కి .. థ్యాంక్స్ అంటూ పవర్ స్టార్ రిప్లై!

by Prasanna |   ( Updated:2024-09-04 13:39:21.0  )
Allu Arjun: అల్లు అర్జున్ విషెస్ కి .. థ్యాంక్స్ అంటూ పవర్ స్టార్ రిప్లై!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎందరు హీరోలు ఉన్నా పవర్ స్టార్ క్రేజే వేరు. ఇతనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆయన చేసే మంచే ఈ రోజు నాయకుడిగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని తట్టుకుని నిలబడి ముందుకు వెళ్తున్నారు. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పి 21 కి 21 సీట్లు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు.

సెప్టెంబర్ 02 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పలు చోట్ల సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఇక్కడ స్టార్ సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా పవర్ స్టార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

బన్నీ చేసిన ఈ ట్వీట్ కు పవర్ స్టార్ రియాక్ట్ అయ్యారు. ఆ ట్వీట్ కి ’థ్యాంక్స్’ చెబుతూ బన్నీకి రిప్లై ఇచ్చారు. ఇక్కడితో అయినా అల్లు vs మెగా ఫ్యాన్స్ సైలెంట్ అయితే బావుండు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరికి మాటలు కలిసాయి.. వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉన్నారు..ఇప్పుడు నష్టం ఫ్యాన్స్ కే కదా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు

Click Here For Twitter Link



Advertisement

Next Story