HHVM మూవీ అప్‌డేట్.. మరింత స్పెషల్‌గా పవర్ స్టార్ బర్త్ డే

by GSrikanth |   ( Updated:2022-09-03 10:14:21.0  )
HHVM మూవీ అప్‌డేట్.. మరింత స్పెషల్‌గా పవర్ స్టార్ బర్త్ డే
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సమీపిస్తోన్న తరుణంలో అభిమానులు గతవారం రోజులనుంచే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా తమ్ముడు, జల్సా సినిమాలు రీ-రిలీజ్ చేస్తుండటంతో ట్విట్టర్ వేదికగా సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మరో శుభవార్త చెప్పారు సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం. క్రిష్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' చిత్రం నుంచి అప్‌డేట్ ఇచ్చారు. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సప్టెంబర్ 2వ తేదీన హరిహర వీరమల్లు నుంచి 'పవర్ గ్లాన్స్' విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ఆగలేకపోతున్నామంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read : పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బర్త్‌డే రోజు అదిరిపోయే గిఫ్ట్

Advertisement

Next Story