లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న యంగ్ హీరో.. ఫొటోలు వైరల్

by Dishaweb |   ( Updated:2023-08-20 16:52:42.0  )
లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న యంగ్ హీరో.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : పాపులర్ తమిళ్ యాక్టర్ కవిన్ రాజ్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ మోనికా దవిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కొద్ది మంది సన్నిహితులు, ఫ్రెండ్స్ హాజరైన ఇంటిమేటెడ్ సెరమనీలో ఆమెకు మూడు ముళ్లు వేశాడు. ఆగస్టు 20న ఉదయం వీరిద్దరు ఏడడుగులు వేసి ఒక్కటి కాగా.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న పిక్స్‌ చూసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక టెలివిజన్ సీరియల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన కవిన్ రాజ్ ‘కానా కానుమ్ కాళంగల్’, ‘పిజ్జా’ చిత్రాలతో మెప్పించగా.. హీరోగా అతను చేసిన ‘దాదా’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి : రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా తమిళ్ స్టార్ హీరో..!

Advertisement

Next Story