సల్మాన్‌తో డేటింగ్‌పై స్పందించిన పూజా.. ఏమీ చెప్పలేనంటూ

by Prasanna |   ( Updated:2023-04-14 08:20:51.0  )
సల్మాన్‌తో డేటింగ్‌పై స్పందించిన పూజా.. ఏమీ చెప్పలేనంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ పుకార్లపై నటి పూజా హెగ్డే స్పందించింది. సల్మాన్‌తో ఆమె నటించిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ఏప్రిల్ 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న పూజా.. రీసెంట్ ఇంటర్య్వూలో డేటింట్ ఇష్యూపై ఓపెన్ అయింది. ‘నేను ఒంటరిగా ఉన్నాను. ఎవరితో ప్రేమలో పడటలేదు. ఈ విషయంపై ఇంకేమీ చెప్పలేను? నా గురించి నెట్టింట ప్రచారమయ్యే చాలా విషయాలు చదువుతూ ఉంటాను. కానీ, పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నేను సింగిల్‌గా ఉండటానికే ఇష్టపడతా. ప్రస్తుతం కెరీర్ అండ్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాపై మాత్రమే నా దృష్టి కేంద్రీకరించాను’ అంటూ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: OTT లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం వచ్చే సినిమాలివే!!

Advertisement

Next Story