రెడ్ అలర్ట్ అంటున్న పూజా హెగ్డే.. షాకింగ్ ఫొటోస్ వైరల్

by sudharani |
రెడ్ అలర్ట్ అంటున్న పూజా హెగ్డే.. షాకింగ్ ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే ‘ఓ లైలా కోసం’ మూవీతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. కానీ, ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందడంతో.. ఐరన్ లెగ్ అనే బిరుదు కూడా తెచ్చుకుంది. ఇక హిందిలో కూడా రెండు, మూడు సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ ఎదుర్కొవడంతో అక్కడ కూడా అమ్మడు క్రేజ్ పడిపోయింది. ప్రజెంట్ తెలుగులో ఒక్క మూవీ కూడా సైన్ చెయ్యని ఈ బ్యూటీ.. హిందిలో మాత్రం షాహిద్ కపూర్ సరసన ‘దేవ’ మూవీ చేస్తుంది. కనీసం ఈ చిత్రం అయినా పూజా మంచి కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉండాలి. లేదుంటే ఈమె సినీ కెరీర్ ఖతం అని చెప్పుకోవచ్చు.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఇన్‌స్టా మాత్రం యాక్టివ్ ఉంటుంది బుట్టబొమ్మ. ఎప్పటికప్పుడు ఫొటో షూట్‌లు చేస్తూ.. కుర్రాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్ముడు కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘రెడ్ అలర్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేసిన ఈ పిక్స్ ప్రజెంట్ వైరల్ కావడంతో.. రెడు శారీలో రెడ్ మిర్చిలా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed