ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే..? వరుడు ఎవరంటే..(వీడియో)

by Kavitha |
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే..? వరుడు ఎవరంటే..(వీడియో)
X

దిశ, సినిమా: నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే మన అందరికీ సుపరిచితమే. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న బుట్ట బొమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. వరస సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల ఈ భామకు ఆఫర్లు తగ్గాయి. గత రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమాల్లోనూ నటించలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం హల్‌చల్ చేస్తుంది. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన వీడియో చూసి బుట్టబొమ్మ పెళ్లి చేసుకోబోతుందనే ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది

ఆ వీడియోలో భాగంగా ఈ భామ భీమ గోల్డ్ బ్రైడల్ జ్యువెల్లరికి యాడ్ ఇచ్చింది. అందులో హల్దీ వేడుకలు చేసుకుంటున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అది చూసిన నెటిజన్లు బుట్ట బొమ్మ పెళ్లి చేసుకుంటుందా అని పక్కా వైఫ్ మెటీరియల్ అంటూ మరికొందరు పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.



Next Story