Jabardasth ఆర్టిస్ట్‌పై పోలీసు కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-08-20 06:18:31.0  )
Jabardasth ఆర్టిస్ట్‌పై పోలీసు కేసు నమోదు.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ ఆర్టిస్ట్ సింగర్ నవ సందీప్‌పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే.. తప్పించుకు తిరుగుతున్నాడని బాధిత ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉంటే నవ సందీప్ జబర్దస్త్ షోలో పాల్గొంటూ సందడి చేస్తుంటాడు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సందీప్ పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed