- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమకు తీరన లోటు అని ప్రధాని మోడీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు. శరత్ బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పీఎం కొనియాడారు. శరత్ బాబు తన సుధీర్ఘ చలన చిత్ర కెరీర్ లో అనేక భాషలలో నటించి ఉత్తమ నటన కనబరిచారని అన్నారు. ఆయన చేసిన పాత్రలు ఎల్లకాలం నిలిచి ఉంటాయని అన్నారు.
శరత్ బాబు మృతి తనకు తీవ్ర బాధను కలిగించిందన్న మోడీ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న నటుడు శరత్ బాబు ఇవాళ (మే 22) మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో ఉంచారు ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు.
Read More: నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు