తారకరత్న మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

by GSrikanth |   ( Updated:2023-02-19 06:34:31.0  )
తారకరత్న మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. 'నందమూరి తారక రత్న గారి అకాల మరణం బాధాకరం. చలనచిత్ర, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతోనే ఉన్నాయి. ఓం శాంతి' అని ప్రధాని ట్వీట్ చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : తారకరత్న పార్థివదేహం వద్ద చంద్రబాబు, విజయసాయి మాటామంతీ

Advertisement

Next Story