- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దయచేసి పురుషులు ఆ పనికి ఆడదాన్ని వాడుకోవద్దు.. నటి ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె హీరోయిన్‌గా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. కానీ కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం బుల్లితెర షోస్‌లో సందడి చేస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. తాజాగా, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా ఇంద్రజ పురుషులు ఆడవాళ్లను తిట్లొద్దని విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో ఫెర్మామెన్స్ చేసిన అమ్మాయిలకు జడ్జ్‌మెంట్ ఇచ్చింది. అంతేకాకుండా స్త్రీలు ఏదైనా సాధించగలరని చెప్పింది. ఆడవాళ్లకు ప్రాణం పోయడమే కాదు. ప్రాణాలు తీయడం కూడా తెలుసు అని ఈ అమ్మాయిలు ఫెర్మామెన్స్ చేసి చూపించారు అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మగవాళ్ళు కొట్టుకుంటే మీ పేర్లతోనే కొట్టుకోండి. అంతే కానీ ఆడవాళ్ళని లాగవద్దు. కొంత మంది గొడవ పడే సమయంలో దయచేసి ఆడవాళ్లను మధ్యలోకి లాగి బూతులు తిట్టవద్దు’’ అని కామెంట్స్ చేసింది.