దయచేసి బతికుండగానే నన్ను చంపకండి: కోట శ్రీనివాసరావు

by Prasanna |   ( Updated:2023-10-12 06:58:50.0  )
దయచేసి  బతికుండగానే  నన్ను చంపకండి: కోట శ్రీనివాసరావు
X

దిశ, సినిమా: తాను మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘సోషల్ మీడియాలో కోటా శ్రీనివాస్ దుర్మరణం అని వార్తలు వస్తున్నాయట. నేనెమో తెల్లారితే ఉగాది పండగ ఏం చేయాలన్న హడావుడితో ఇంట్లో వాళ్లతో ముచ్చటిస్తున్నా. ఉదయం 7 గంటల నుంచి కనీసం 50 ఫోన్లు వచ్చాయి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే 10 మంది పోలీసులు వ్యాన్‌లో వచ్చారు. అంటే ఇండస్ట్రీలో పెద్దాయన కదా, పెద్దపెద్ద వాళ్లు వస్తారు.. సెక్యూరిటీ కోసం వచ్చామని అన్నారు. ఇలాంటి వార్తలు, వదంతులు ఎవరు నమ్మకండి. జీవితంలో డబ్బు సంపాదించడానికి చెండాలపు పనులు బోలెడుంటయ్. ఇలా ప్రాణాలతో ఆడుకోవద్దు’ అంటూ ఆయన కోరారు. ఇక, ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆవందతులను నమ్మొద్దని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Advertisement

Next Story