MAHESH BABU:మహేష్ బాబు చీరకట్టి, పూలు పెట్టిన ఫొటోలు వైరల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముచ్చటపడిపోతున్న ఫ్యాన్స్

by Anjali |
MAHESH BABU:మహేష్ బాబు చీరకట్టి, పూలు పెట్టిన ఫొటోలు వైరల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముచ్చటపడిపోతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కానీ చాలా ఏళ్ల తర్వాత ఈ హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రిన్స్ నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని సూపర్ స్టార్ ఏకంగా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో జతకట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు-జక్కన్న కాంబినేషనలో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. ఇందుకోసం సూపర్ స్టార్ కూడా భారీ వర్కౌట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే..

కొన్ని సినిమాల్లోని సీన్స్ ప్రేక్షకులకు నచ్చేలా మలిచేందుకు దర్శకులు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. కాగా పలువురు హీరోలు చీర కట్టుకుని ఆడవాళ్లలా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పుష్ప చిత్రం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శారీ కట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మన సూపర్ స్టార్ కూడా చీర కట్టి.. పూలు పెట్టుకున్న ఓ సినిమా ఉందని మీకు తెలుసా? ఆ మూవీ ఏదో కాదు.. బాలచంద్రులు చిత్రం. ఇందులో ప్రిన్స్ చీర కట్టుకుని వయ్యారంగా నడుస్తాడు. రౌడీలను అట్రాక్ట్ చేసే ఓ సన్నివేశం ఉంటుంది. ఈ మూవీలో మహేష్ చీర కట్టిన సీన్లు చూసినట్లైతే అస్సలు ఆయనలా కనిపించరు. చాలా క్యూట్‌గా, అమాయకంగా ఎంతో చక్కగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు.

Advertisement

Next Story