ఫొటోగ్రాఫర్‌కు గాయం కావడంతో విలవిలలాడిపోయిన హీరోయిన్.. వెంటనే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లింది..

by Nagaya |   ( Updated:2023-11-14 12:31:11.0  )
ఫొటోగ్రాఫర్‌కు గాయం కావడంతో విలవిలలాడిపోయిన హీరోయిన్.. వెంటనే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లింది..
X

దిశ, సినిమా : హీరోయిన్ రాణీ ముఖర్జీపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. ముంబైలో ఓ సెలబ్రిటీ ఇచ్చిన దీపావళి పార్టీకి హాజరయ్యేందుకు కారులో అక్కడకు చేరుకుంది ఈ బ్యూటీ. అయితే ఆమెను ఫొటో తీసే క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ కాలుకు గాయం కావడంతో.. వెంటనే రెస్పాండ్ అయింది. వెంటనే డ్రైవర్‌ను కారు ఆపమన్న హీరోయిన్.. అదే కారులో గాయపడిన ఫొటోగ్రాఫర్‌కు తక్షణ వైద్యసహాయం అందించేందుకు హాస్పిటల్‌కు పంపించింది. దీంతో రాణి గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు.

రీసెంట్‌గా రిలీజైన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన కుటుంబంతో కలిసి నార్వేలో నివసిస్తున్న భారతీయ మహిళ.. నార్వే అధికారుల నుంచి తన పిల్లల కస్టడీని తిరిగి పొందేందుకు చేసే పోరాటమే ఈ కథ. కాగా సక్సెస్ మీట్‌లో పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకుని బాధపడింది. సెకండ్ ప్రెగ్నెన్సీ ఐదో నెలలో అబార్ట్ కావడాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది.

Advertisement

Next Story

Most Viewed