- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ.. ఎమోషనల్ ట్వీట్ పెట్టిన శ్రీలీల.. ఏమన్నదంటే!
దిశ, సినిమా: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒక్కరొక్కరుగా ప్రచారంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎలక్షన్ కాంపెయిన్ చేశారు. నిన్న రామ్ చరణ్, సురేఖ కూడా వెళ్లారు. అయితే పవన్ కల్యాణ్‌కు మద్దతుగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పోస్టులు పెట్టిన ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
తాజాగా, స్టార్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్ని శ్రీలీల కూడా పవన్క మద్దతుగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ సార్. మీ ఎన్నికల ప్రయాణంలో మీరు కోరుకున్నదంతా సాధిస్తారని, మీ వాగ్దానాల అన్నింటినీ నిలబెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. పిఠాపురంలో భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది.
సినీ సెలబ్రిటీల అందరిలో శ్రీలీల ట్వీట్ ఎమోషనల్‌గా ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలింది. కానీ ఈ అమ్మడికి వరుసగా నాలుగు ఫ్లాప్‌లు రావడంతో వచ్చిన క్రేజ్ ఒక్కసారిగా పోయింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు, మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఆఫర్లు రాకపోవడంతో శ్రీలీల ఖాళీగా ఉంటూ పలు యాడ్ షూట్స్‌తో డబ్బులు సంపాదిస్తూనే.. డాక్టర్ చదువుతుంది.