దుమ్మురేపుతోన్న పవన్ అన్ స్టాపబుల్ టీజర్.. యూట్యూబ్ షేక్ (వీడియో)

by Satheesh |   ( Updated:2024-07-02 15:22:33.0  )
దుమ్మురేపుతోన్న పవన్ అన్ స్టాపబుల్ టీజర్.. యూట్యూబ్ షేక్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ 2 షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ టీజర్‌ను ఆహా రిలీజ్ చేసింది. పవన్ ఫ్యాన్స్ ఎంతో అతృతగా ఎదురుచూస్తోన్న ఈ ఎపిసోడ్ టీజర్‌ను 8 గంటలకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా రిలీజ్ చేయగా.. నిమిషాల్లోనే ఈ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ ప్రోమోలో బాలయ్య తనదైన శైలీలో పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. రాజకీయాలు, సినిమాలు, వ్యక్తిగత విషయాలపై బాలయ్య ప్రశ్నలు వేసినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

చిరంజీవి నుండి నేర్చుకున్న మంచి, చెడు విషయాలు ఏంటన్న కాంట్రావర్సీ ప్రశ్నలు అడిగిన బాలయ్య.. ఎపిసోడ్‌పై మరింత హైప్ క్రియేట్ చేశాడు. పవన్‌కు ఫ్యాన్ కానివారు లేరని.. కానీ ఫ్యాన్స్ అభిమానం ఓటింగ్‌గా ఎందుకు కన్వర్ట్ కాలేదన్న ఆసక్తికరమైన ప్రశ్నలు బాలయ్య సంధించారు. దీంతో బాలయ్య, పవన్‌ల ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ చూసిన అభిమానులు.. గత ఎపిసోడ్‌ల రికార్డ్‌లు బ్రేక్ చేయడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Click Here For Video Post..

Advertisement

Next Story