బాలయ్య షోలో ఏడ్చేసిన Pawan Kalyan.. ఎందుకో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2023-02-03 07:29:26.0  )
బాలయ్య షోలో ఏడ్చేసిన Pawan Kalyan.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి నటసింహం బాలయ్య హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ఈ షో టాప్ రేంజ్‌కు వెళ్లింది. ఎంతో మంది సీనియర్ నటులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఈ షోలో పాల్గొని సందడి చేశారు. కాగా, ఈ షో సెకండ్ సీజన్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూడగా, గురువారం పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో ఫస్ట్ పార్ట్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ షోలో పవన్‌తో పాటు, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొని సండడి చేశాడు. అయితే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకున్నారు. అది ఏమిటంటే? బాలయ్య మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్‌కు యాక్సి డెంట్ జరిగిన సమయంలో నువ్వు చాలా అప్సెట్ అయ్యావని విన్నాను అంటూ పవన్‌ను అడగగా, పవర్ స్టార్ మాట్లాడుతూ.. సంఘటన జరిగిన సమయంలో నేను ఇంట్లో లేను, ప్రమాదం జరిగిన వెంటనే త్రివిక్రమ్ నాకు కాల్ చేశారు కానీ కలవలేదంట. ఇక మా ఇద్దరి మధ్య ఉన్న ఓ వ్యక్తి వలన నాకు యాక్సిడెంట్ విషయం తెలిసింది. దీతో వెంటనే నేను ఆసుపత్రికి వెళ్లాను.. అక్కడ సాయిని చూసిన వెంటనే చాలా బాధగా అనిపించింది అపస్మారక స్థితిలో ఉన్నాడు, కోలుకుంటాడు అనిపించినా, వాడిని అలా చూసి బాధ అనిపించింది, అలాగే మూడు రోజులు గడిచినా పరిస్థితి విషమంగానే ఉందని చెప్పడంతో చాలా కంగారు పడ్డాను, చావునుంచి బయటపడ్డాడు అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి : కళాతపస్వి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Advertisement

Next Story

Most Viewed