ప్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!

by sudharani |
ప్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: అటూ రాజకీయాలతో, ఇటూ సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో.. ఈలోపు నాలుగు సినమాలు కంప్లీట్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్న పవన్ వరుసగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా కొత్త సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ప్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు టాక్.

నిఖిల్ ‘స్వామిరారా’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ.. రావణాసుర మూవీతో పెద్ద ప్లాప్‌ను ఎదుక్కొన్నాడు. అయితే ఇప్పుడు సుధీర్ వర్మతో పవన్ సినిమా అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. డైరెక్టర్ సుధీర్ సంవత్సరం నుంచి ట్రై చేస్తుంటే రీసెంట్‌గా అతని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట పవన్. కాగా.. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందిస్తున్నట్లు సమాచారం. మరి ఈ కాంబో సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story