పార్టీ కోసం భార్య పిల్లలను లెక్కచేయలేదు: పవన్‌పై Nagababu ప్రశంసలు

by Prasanna |   ( Updated:2023-09-09 14:06:49.0  )
పార్టీ కోసం భార్య పిల్లలను లెక్కచేయలేదు: పవన్‌పై Nagababu ప్రశంసలు
X

దిశ, సినిమా : రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, ఆయన అభిమానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఆయన చాలా ధైర్యం చేసి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మొదటి పోటిలోనే గట్టి దెబ్బ తిన్నప్పటికి ఏ మాత్రం బెదరకుండా ప్రత్యర్థులతో పోరాడుతున్నాడు. అయితే లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ మీద గణ అనే రచయిత 'ది రియల్ యోగి' అనే పుస్తకం రచించాడు. ఈ పుస్తకం లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగబాబు, ఆనంద్ సాయి, మెహర్ రమేష్, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు. నాగబాబు మాట్లాడుతూ.. 'నా తమ్ముడి గురించి ఎక్కువగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ, కొన్ని విషయాలు అందరికీ తెలియాలి. పవన్ ఎప్పుడు జనాల కోసం ఆలోచించే వ్యక్తి. తన భార్య బిడ్డలను కూడా వాళ్ళ కోసం కొన్ని సార్లు లెక్క చెయ్యని సందర్భాలున్నాయి. ఈ పార్టీ స్థాపించడానికి కళ్యాణ్ తన పిల్లల మీద ఉన్న ఫిక్ట్స్‌డ్ డిపాజిట్‌ని బ్రేక్ చేశాడు. ఉన్న డబ్బుని మొత్తం పార్టీ కోసం కేటాయించాడు. ఈరోజు నా తమ్ముడు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ స్టార్ హీరో. కానీ, ఆర్థికంగా చూసుకుంటే పెద్ద జీరో' అని నాగబాబు ఎమోషనల్ కామెంట్స్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed