Pawan Kalyan: జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం..

by Kavitha |
Pawan Kalyan: జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం..
X

దిశ, సినిమా: నిన్న 70వ నేషనల్ ఫిలిం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమాగా కార్తీకేయ 2.. మలయాళీ సినిమాగా ఆట్టమ్ నిలిచాయి. అలాగే కన్నడ సినిమాగా కేజీఎఫ్ 2లను జాతీయ చలనచిత్ర అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా హీరో రిషబ్ శెట్టి (కాంతార) ఎంపిక అయ్యారు. అలాగే ఉత్తమ నటిగా నిత్యామీనన్ (తిరుచిత్రంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్) ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలుగా ఎంపికైన నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. "ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగు నుంచి 'కార్తికేయ-2' అవార్డు పొందటం సంతోషకరం. ఆ చిత్ర దర్శకుడు చందు మొండేటి , నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ ,టి.జి.విశ్వప్రసాద్ , చిత్ర కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ , చిత్ర బృందానికి అభినందనలు. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనువాద చిత్రాలు కాంతారా, పొన్నియన్ సెల్వన్-1, తిరుచిత్రాంబళం, కేజీఎఫ్-2 వివిధ కేటగిరీల్లో పురస్కారాలు పొందాయి. ఉత్తమ నటి నిత్య మీనన్ , ఉత్తమ నటుడు రిషబ్ శెట్టికి అభినందనలు అని అన్నారు. అలాగే జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికైన జానీ మాస్టర్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆయన నృత్యాల్లో జానపద, పాశ్చాత్య శైలుల మేళవింపు కనిపిస్తుంది. జానీ మాస్టర్ సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు. తన నృత్యాలతో ప్రేక్షకుల మెప్పు పొందుతూ మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed