Pathaan: ‘పఠాన్’.. ఏప్రిల్‌ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌?

by Prasanna |   ( Updated:2023-03-08 07:17:15.0  )
Pathaan: ‘పఠాన్’.. ఏప్రిల్‌ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌?
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’. సిద్దార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఊహించని రికార్డులు సృష్టించింది. ఇదిలావుంటే.. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఓటీటీ రైట్స్‌ని ఇటీవల భారీ ధరకు కొనుగోలు చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఏప్రిల్‌ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను తీసుకురానున్నారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే, జాన్ అబ్రహాం కీలకపాత్రల్లో నటించారు.

Also Read: వామ్మో సమంతకు ఆ అలవాటు కూడా ఉందా.. ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్?

Advertisement

Next Story